Oct 27,2023 21:16

ఫొటో : నిరసన చేపడుతున్న టిడిపి నాయకులు

'కాకర్ల' ఉచిత వైద్య సేవలు
ప్రజాశక్తి-ఉదయగిరి : కాకర్ల ట్రస్ట్‌ అధినేత కాకర్ల సురేష్‌ ఎన్‌టిఆర్‌ సంజీవని ఆరోగ్య రథంతో 172మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. శుక్రవారం దుత్తలూరు మండలం తెడ్డుపాడు రామాలయం వద్ద 157వ రోజు కాకర్ల చారిటబుల్‌ ట్రస్ట్‌ సంజీవని ఆరోగ్య రథంతో అనారోగ్య సమస్యలు ఉన్న గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. 108మందిని డాక్టర్‌లు వివిధ ఆరోగ్య సమస్యలు పరీక్షించి 64మంది కంటి చూపు సమస్యలతో పాటు మొత్తం 172 మంది చికిత్స అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గం టిడిపి నాయకులు ట్రస్ట్‌ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్‌ వైద్య శిబిరాన్ని సందర్శించి అందిస్తున్న వైద్య సేవలను గ్రామస్తుల నుండి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జగన్‌మోహన్‌ రెడ్డి నిరంకుశ రాక్షస పాలనతో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై గ్రామస్తులతో నల్లజెండాలతో శాంతియుత నిరసన తెలిపారు. 186వ రోజు అన్న క్యాంటీన్‌ ద్వారా 612 మంది తమ ఆకలిని తీర్చుకొన్నారు.