కాకాని వెంకటరత్నంకు జెడ్పి ఛైర్మెన్ నివాళి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఆజాదీ కా అమత్ మహోత్సవ్‌లో భాగంగా బుధవారం జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నుండి స్వాతంత్య్ర సమరయోధుడు కాకాని వెంకటరత్నం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించిన జెడ్‌పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్, డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్, జెడ్‌పిసిఈఓ ప్రభాకర్ రెడ్డి, డిఆర్‌డిఏ పిడి తులసి తదితరులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జెడ్‌పి చైర్మన్ మాట్లాడుతూ కాకాని వెంకటరత్నం 1900 సంవత్సరం, ఆగస్టు 3వ తేదీన కష్ణా జిల్లా, వుయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారని, మహాత్మా గాంధీ ఉపదేశాలతో స్పూర్తి పొంది 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారని, క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసారని దేశ స్వాతంత్య్రం కోసం పని చేసిన స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలు అందరికీ ఆదర్శమని తెలిపారు.










