May 29,2023 16:23
  • పకడ్బందీగా నిర్వహించాలని డిఈఓ ఎం.సాయిరామ్ ఆదేశం

ప్రజాశక్తి-అనంతపురం సిటీ : నగరంలోని కేఎస్ఆర్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి చీప్ సూపర్డెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సాయిరామ్ మాట్లాడుతూ.... జూన్ రెండో తేదీ నుండి పదవ తేదీ వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసామని, ఉదయం 9:30 గంటల నుండి 12:45 గంటల వరకు జరిగే పరీక్షలకు 14465 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు మంగళవారం జిల్లాకు వస్తాయని, వాటిని బుధవారం ఆయా పోలీస్ స్టేషన్లకు తరలిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు త్రాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, బెంచీలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో బయట వ్యక్తులను ఎవర్ని లోపలికి అనుమతించకూడదన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదన్నారు. పరీక్షల్లో ఇలాంటి మాస్ కాపీలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసి గోవింద నాయక్, డివైఈఓ లు పద్మప్రియ, శంకర ప్రసాద్, పర్యవేక్షకులు సరళ, తదితరులు పాల్గొన్నారు.