Jun 14,2023 14:56

ప్రజాశక్తి-చిత్తూరు : జూడో రాష్ట్ర ఛాంపియన్ షిప్ ట్రోఫీలను దివాకర్ రెడ్డి, రాజేష్, భానుప్రకాష్ రెడ్డి డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి, జిల్లా జూడో అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, కార్యదర్శి చీనేపల్లి కిరణ్ కుమార్ లు డాలర్స్ గ్రూప్ ఆఫీస్ నందు ఆవిష్కరించారు. ఈ నెల 17 నుండి 19 వరకు తిరుపతి, శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు జరుగు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ క్యాడెట్ జూడో ఛాంపియన్ షిప్ -2023 ట్రోఫీ లను బుధవారం ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ట్రోఫీలను, మెడల్స్, మెమెంటోస్ అందించిన డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డికి, పిల్లలకు భోజనాలు అందిస్తున్న ఉపాధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి కి అభినందనలు అని రాజేష్ అన్నారు. రాష్ట్ర జూడో సంఘం అధ్యక్షలు ఆనం రామకిశోర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బద్దుల శ్రీధర్, సీయివో కె.యన్.బాబు సమక్షంలో రాష్ట్ర ఓపెన్ క్యాడెట్ జూడో ఛాంపియన్ షిప్ జరుగును అని రాష్ట్ర జూడో సంఘం కోశాధికారి చీనేపల్లి కిరణ్ కుమార్ అన్నారు.