Sep 22,2023 14:25

ప్రజాశక్తి-వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొన్న యుగంధర్ మృతుని కుటుంబాన్ని ఓదార్చారు. వెదురుకుప్ప మండలం ఎగువ పల్లాలు, దాసరి కాలనీ, బండి చిన్న చెల్లెమ్మ  (57)శుక్రవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొన్న యుగంధర్  భౌతిక కాయానికి, పూలమాల వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన, నివాళులు అర్పించిన వారిలో మండల ఉపాధ్యక్షులు నలిపి రెడ్డి మధు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, మండల యువజన అధ్యక్షులు సతీష్, కార్వేటినగరం మండల ప్రధాన కార్యదర్శి నరేష్. తదితరులు ఉన్నారు.