Apr 09,2023 15:03

ప్రజాశక్తి-బొమ్మనహల్ : బొమ్మనహల్ మండలంలోని నేమికల్ గ్రామంలో గల కురుబ చిక్కన్న గత ఎంపీటీసీ ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అప్పటినుండి ఇప్పటివరకు వైయస్సార్సీపీలో తగినంత గుర్తింపు లేక నేను టిడిపిలో చేరుతున్నానని చిక్కన్న ఫోన్ ద్వారా తెలిపారు. ఆదివారం ఇవ్వగలం పాదయాత్ర కార్యక్రమం సింగనమలలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్లి రాయదుర్గం ఇన్చార్జి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో టిడిపిలో చేరినట్లు చిక్కన్న తెలిపారు. వైయస్సార్సీపి పని అయిపోయిందని ఆ పార్టీలో ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు వారు పెట్టిన పెట్టుబడి కూడా సంపాదించుకోలేక భూములమ్ముకుని అప్పులు కట్టవలసిన దుస్థితి ఏర్పడిందని అంతేకాకుండా మండలంలో ఇద్దరికే ప్రాధాన్యత ఉందని వైయస్సార్సీపీలో ఎంపీపీ భర్త చంద్రశేఖర్ రెడ్డి పార్టీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి తప్ప ఎవరే గాని ఎమ్మెల్యేతో మాట్లాడే చనువే లేకుండా పోయిందని ఎమ్మెల్యేకి పలుమార్లు మా కష్టాలు విన్నవించిన చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడడం దాటువేసి వెళ్లారని అందుకోసం మనస్థాపం చెంది వైయస్ఆర్సీపీని వదిలి టిడిపిలో చేరినట్లు చిక్కన్న తెలిపారు.