Jun 09,2023 16:23

ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం) : మండల కేంద్రంలోని బస్టాండ్ సర్కిల్ నందు నీటి సాధనకై జూన్ 10 నుంచి 20 వరకు రైతు గర్జన ప్రచార జాత కరపత్రాలు శుక్రవారం విడుదల చేశారు. అనంతరం పుట్లూరు మండల కార్యదర్శి డి.పెద్దయ్య మాట్లాడుతూ! అనంతపురం జిల్లా దేశంలోకెల్లా అతి తక్కువ వర్షపాతం కలిగిన జిల్లా. ఈ జిల్లా ప్రజలకు సాగునీరు, తాగునీరు ఇవ్వాలని జిల్లా ప్రజలు, రాజకీయ పార్టీలు దశాబ్దాల నుండి ఆందోళన చేసిన ఫలితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తుంగభద్ర జలాశయం నుంచి ఎగో కాలువ శ్రీశైలం డ్యామ్ నుండి బ్యాక్ వాటర్ ఆధారంగా హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీరు, తాగునీరు అందించడానికి ఈ రెండు కాలువలు నిర్మాణం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కాలవ నుండి దిగువ ప్రాంతమైన అనంతపురం జిల్లాకు నిరు రాకుండా చేయడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బచావత్ట్రిబ్యునల్ లో ఏమాత్రం నీటి కేటాయింపులు లేనప్పటికీ " అప్పర్ భద్ర" ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకొన్నారు.ఇప్పటికే తుంగభద్రపైన భద్ర ప్రాజెక్టు ద్వారా కర్ణాటక లోని 3జిల్లాలకు సాగునీరు,తాగునీరు తీచుకుంటున్నారు.భద్ర జలాశయం నుండి వరద వచ్చినప్పుడే తుంగభద్ర జలాశయంలోకి నీళ్లు వస్తున్నాయి.ఈ క్రమంలో భద్ర ఎగువ ప్రాంతంలో అప్పర్ భద్ర మరొక ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం ద్వారా దోడ్డిమార్గంలో అనుమతులు పొంది కేంద్రంలో వున్న BJP, గతంలో రాష్ట్రంలో వున్న అధికారంలో వున్న బిజెపి కర్ణాటక ఎన్నికలలో గెలవడానికి కేంద్ర బడ్జెట్ లో 5300 కోట్లు రూ" నిధులు మంజూరు చేసుకోగలిగారు.ఈ అక్రమ ప్రాజెక్టుపైన సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎట్టిపరిస్థితుల లో ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకూడదు.నిధులు ఇవ్వకూడదు. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం జరిగితే బళ్లారి జిల్లా, అనంతపురం, కడప జిల్లా లు తీవ్రంగా  నష్టపోతాయని తెలిపారు.