Aug 15,2023 21:55

జయహో భారత్‌..
ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌:  భారత 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా, కన్నుల పండుగగా జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఇంచార్జ్‌ మంత్రి, రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయోవద్ధుల సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌కి జిలా కలెక్టర్‌ సగిలి షన్‌ మోహన్‌, ఎస్‌పి వై.రిషాంత్‌ రెడ్డి స్వాగతం పలికారు. ఇంచార్జ్‌ మంత్రి ఉదయం 9.10 గంటలకు జాతయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు, జెడ్పి ఛైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంఎల్‌ఏ ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్‌ అముద, జేసి పి.శ్రీనివాసులు, డిఆర్‌ఓ ఎన్‌.రాజశేఖర్‌, రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శాంతి, ఏఎస్‌పిలు నాగేశ్వరరావు, సుధాకర్‌ రావు, శ్రీలక్ష్మీ, జెడ్పి వైస్‌ఛైర్మన్‌ రమ్య, జెడ్పి సీఈఓ ప్రభాకర్‌ రెడ్డి, జెడ్పి మహిళాస్థాయి సంఘ ఛైర్మన్‌ భారతి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గ్రౌండ్‌ నందు ఏర్పాటు చేసిన పోలీస్‌ పెరేడ్‌ను జిల్లా కలెక్టర్‌, ఎస్పిలతో కలసి పోలీస్‌ పెరేడ్‌ వాహనంలో వెళ్ళి పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలలో సాధించిన ప్రగతిని ఇంచార్జ్‌ మంత్రి ప్రసంగ పాఠంగా చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమాభివద్ధి పథకాలకు సంబంధించి శకటాల ప్రదర్శన, వివిధ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు దేశభక్తిని పెంపొందించేలా చేసిన నత్యప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ సేవలను కనపరచిన ఉద్యోగులకు ముఖ్యఅతిథి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించారు. పోలీస్‌శాఖకు సంబంధించి మహోన్నత సేవపథకం డిఎస్‌పి బాబు ప్రసాద్‌, ఇన్స్పెక్టర్‌ గంగిరెడ్డి, సేవాపథకం ఏఎస్‌ఐ సుధాకర్‌ పిళ్లై, హరికష్ణ, డబ్ల్యూ ఏఎస్‌ఐ లక్ష్మీ, ఏఎస్‌ఐ శ్రీనివాసులు నాయుడు, హెచ్‌సి భాస్కరయ్య, నాగేంద్ర, అంత్రిక్‌ సురక్ష సేవాపథకం రాజేష్‌, చలపతి, పిసి ఫైరోజ్‌ అందుకున్నారు. జిల్లా అధికారులు డిఆర్‌డిఏ, మెప్మా, హౌసింగ్‌, డ్వామా పిడిలు తులసి, రాధమ్మ, పద్మనాభం, గంగా భవానీ, సాంఘీక సంక్షేమ శాఖాధికారి రాజ్య లక్ష్మీ, నగర కమిషనర్‌ అరుణలతో పాటు ఎంపికౖెెన అధికారులు, సిబ్బంది ప్రశంసా పత్రాలు పొందారు. శకటాలు పరదర్శన కార్యక్రమాలలో మొదటి, రెండవ, మూడవ బహుమతి అందుకున్న విజేతలకు బహుమతి, జ్ఞాపికను, సాంస్కతిక కార్యక్రమాలు చేసిన పాఠశాల విద్యార్థులకు మొమెంటోలను అందించారు. గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను జిల్లా కలెక్టర్‌, ఎస్పిలతో కలసి ఇంచార్జ్‌ మంత్రి తిలకించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల సంబంధించిన మెగా చెక్కులను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో చివరగా జాతీయ గీత లాపనతో వేడుకలు ముగిశాయి.