Oct 07,2023 20:12

శిబిరం వద్ద పరిశీలిస్తున్న డిఎంఅండ్‌హెచ్‌ఒ

శిబిరం వద్ద పరిశీలిస్తున్న డిఎంఅండ్‌హెచ్‌ఒ
జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు
ప్రజాశక్తి-గుడ్లూరు:మండలంలో విజృంభించిన జ్వరాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ ప్రియంవదా అన్నారు. మండలంలోని పొట్లూరులో శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి డిఎంఅండ్‌హెచ్‌ఒ ముఖ్యఅతిథిగా వచ్చారు. 328 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధుల నివారణకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైద్య శిబిరం దగ్గర అంగన్వాడి కార్యకర్తలు ఏర్పాటుచేసిన బలవర్ధకమైన ఆహారంతో కూడిన పదార్థాలు స్టాల్స్‌ గ్రామస్తుల్ని ఆకట్టుకున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు ఎస్‌కె. అమీరున్నీసా, కష్ణకుమారి, రమాదేవి పాల్గొన్నారు.