జరవారిపల్లి పంచాయతీలో 'గడప గడపకు మన ప్రభుత్వం'
ప్రజాశక్తి- పలమనేరు: పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక జరవారిపల్లి పంచాయతీ నందు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఎమల్యే మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పలమనేరులో అత్యద్భుతంగా జరుగుతోందన్నారు. జగనన్న ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన పలమనేరు ప్రజల ఆనందం వారి మాటల్లోనే వ్యక్తమతోందని, తాము అడిగినా, అడగక పోయినా జగనన్న మేలు చేస్తున్నారంటూ పేద ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు. జగనన్న పెద్ద ఎత్తున మంచి పనులు చేస్తున్నారంటూ మధ్య తరగతి, ఉన్నత వర్గాల వారు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 65వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సామాన్యమైన విషయం కాదని, తమ జీవితాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెలుగులు నింపుతున్నారన్న సంతోషాన్ని అంతా వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, తహశీల్దార్, అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










