జర్నలిస్ట్‌పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని చిత్తూరు ప్రెస్ క్లబ్ కమిటీ డిమాండ్ చేసింది. చిత్తూరు నగరంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ యాగవేంద్రరెడ్డిపై బుధవారం శరవణన, రాజబాబు అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఈ సందర్భంగా దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ చిత్తూరు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చిత్తూరు వన్‌టౌన్ సీఐ నరసింహరాజుకు ఫిర్యాదు అందచేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శరవణ, రాజబాబులు రౌడీలాగా వ్యవహరించారాని వారి నుండి ప్రాణహాని ఉందనియాగవేంద్రరెడ్డికి రక్షణ కల్పించి, దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. చిత్తూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు లోకనాథం, కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ కుమార్, ట్రెజరర్ పవన్‌కుమార్, జాయింట్ సెక్రటరీ అభి, కార్యవర్గ సభ్యులు గౌరీ ప్రసాద్, మురళీకష్ణ , జర్నలిస్టులు పాల్గొన్నారు.










