May 20,2023 15:12

ప్రజాశక్తి-కాళ్ల : వైసీపీ ప్రభుత్వనికి పాలనపై ఆగాహన లేక, అధికారులపై పట్టు లేక గ్రామాల్లో వేసవి కాలంలో అప్రగటిత విద్యుత్ కోతల వల్ల  ప్రజలు, ఆక్వా రైతుల అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తిగ నాగరాజు  అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మండల కేంద్రమైన శనివారం కాళ్ళలో మండల జనసేనపార్టీ అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు ఆధ్వర్యంలో కాళ్ళ సబ్ స్టేషన్ ముట్టడి చేశారు. ఈసందర్భంగా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గంలో వేళాపాళా లేకుండా అనధికారికంగా కరెంట్ కోతలను విధిస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో  ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్నారు.  ఇంట్లో ఉంటే ఉక్కపోతతో , బయటికి వెళ్తే వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారన్నారు. కరెంట్ లేకపోతే పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేసవికాలంలో విద్యుత్ వాడకం ఎక్కువ ఉంటుందన్న విషయం ప్రభుత్వానికి , అధికారులకు తెలిసిన నిమ్మకునీరెత్తనట్టువ్యవహారిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయని జాతీయ విపత్తు సంస్థలు మొత్తుకుంటున్నా పాలకులు, అధికారులు మొద్దు నిద్రపోవటంచాలా దారుణం. వేసవికాలం సమీపిస్తున్న సమయంలో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పంపిణీపై సమీక్షలు నిర్వహించలేనంత దుస్థితిలోఉందన్నారు. విద్యుత్ కోతలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నా స్థానిక నాయకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించటం దారుణమన్నారు. ఇప్పటికైనా విద్యుత్ అంతరాయాలనునిలువరించకపోతే ప్రభుత్వం తగిన మూల్యంచెల్లించుకోకతప్పదన్నారు.అనంతరం జెఈకి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని  అందజేశారు. ఈ కార్యక్రమంలో కాళ్ళ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యక్రదర్సులు ఇర్రింకి జగన్ ఆరేటి దిలీప్ కుమార్, గడి రాము, నిమ్మకాయల  తదితరులు పాల్గొన్నారు.