Sep 25,2023 00:09

జనావాసాల మధ్య కొండచిలువ


జనావాసాల మధ్య కొండచిలువ
ప్రజాశక్తి-గుడిపల్లి: గుడిపల్లి మండల లోని బిసి హాస్టల్‌ ప్రాంతంలోని జనావాసాలకు మధ్యలో పెద్ద పాము కనిపించడంతో ఆదివారం ఆ కుటుం తబాలు భయభ్రాంతులకు గురి అయ్యాయి. ఈ సమాచారం గుడిపల్లి మండల పంచాయతీ పార్టీ ప్రసిడెంట్‌ టిడిపి నాయకుడు మంజునాథ్‌ కి సమాచారం అందిం చారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే అటవీ శాఖ సిబ్బంది రహీం కు సమాచారం అందించిన వెంటనే అటవీ శాఖకు సంబంధించిన శివకు వెంటనే సమాచారం అందించి శివ చాకచక్యంగా స్థానికుల సహాయంతో ఆ పామును వెంటనే పట్టుకుని మల్లప్ప కొండ అడవి పరిసరాల్లో జాగ్రత్తగా విడిచిపెట్టారు. దీంతో స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి కతజ్ఞతలు తెలిపారు.