
ఇచ్ఛాపురం: స్థానిక జ్ఞానభారతి పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి క్లస్టర్ మీట్‌లో పతకాలు సాధించి జాతీయ స్థాయిలో జరగనున్న పోటీలకు ఎంపికకావడం హర్షణీయమని భారతి విద్యా సంస్థల కార్యదర్శి జోహర్ ఖాన్ అన్నారు. అక్టోబరు 26 నుంచి 29 వరకు జరిగిన క్లస్టర్- 7 అథ్లెటిక్స్ మీట్‌కు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో అదానీ వరల్డ్ స్కూల్‌కు పాల్గొరని అన్నారు. ఈ అథ్లెటిక్స్ మీట్ పోటీల్లో పదో తరగతికి చెందిన డి.అశ్వద్ధామ రాష్ట్రస్థాయిలో హైజంప్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుని బ్రోన్డ్ మెడల్ పొందారని అన్నారు. అలాగే పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి బి.సునీల్ ట్రిపుల్ జంప్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ స్థానాన్ని పొంది సిల్వర్ మెడల్ కైవసం చేసుకుని జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్ పోటీలకు అర్హతను పొందారని తెలిపారు. ఈ నెల నుంచి 7 వరకు నిర్వహించనున్న నేషనల్ సిబిఎస్‌ఇ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యదర్శితో పాటు పాఠశాల ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వి.రమణమూర్తి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఐ.బి.పండా, హెడ్ మినిస్టర్ రషీదా సుల్తానా, ఎఒ ప్రేమ్ సతాజ్‌ఖాన్, మేనేజర్ ప్రమోద్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు కైలాస్ పండా, డి.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.