Jul 13,2023 20:27

ప్రజాశక్తి - భీమవరంరూరల్‌
ప్రజలందరూ జనాభా పెరుగుదలపై అవగాహన కలిగి ఉండాలని, కుటుంబ నియంత్రణపై ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కెజిఆర్‌ఎల్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఐ.శ్రీరామచంద్రమూర్తి అన్నారు. గురువారం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో కెజిఆర్‌ఎల్‌ కళాశాల విద్యార్థులతో కుటుంబ నియంత్రణపై ర్యాలీ, జనాభా నియంత్రణపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లతో ర్యాలీ చేపట్టామని, డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో 63 మంది విద్యార్థులు పాల్గొన్నారని, 18న జరిగే ముగింపు వేడుకల్లో విజేతలకు ప్రభుత్వ వైద్య అధికారుల సమక్షంలో బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పి.జ్యోతి, సత్యనారాయణ, హెచ్‌ఒడి ఛాయా, నాచు శ్రీవల్లి అధ్యాపకులు పాల్గొన్నారు.