Jul 11,2022 22:56

జనాభా నియత్రణపై అవగాహన
డిఎం అండ్‌ హెచ్‌ఒ రామ్‌మోహన్‌రెడ్డి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జనాభా నియత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారి రామ్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లాప్రభుత్వ ఆసుపత్రి నుంచి గాంధీవిగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీని డిఎం అండ్‌హెచ్‌ఒ ప్రారంభించారు. గాంధీవిగ్రహం ఎదుట నిర్వహించిన మానవాహారాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ జనాభా నియత్రణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బది జనాభా నియత్రణ కోసం తీసుకోవాల్సిన జాత్త్రలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ అధికారులు, నర్సింగ్‌ విద్యర్థునులు పాల్గొన్నారు.
కార్వేటినగరం: దేశ జనాభా నియంత్రణతోనే దేశ అభివద్ధి ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయులు రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జాతీయ సమన్వయకర్త డాక్టర్‌ ధనంజయరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులు డాక్టర్‌ గోపీనాథ్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌, ఎంపీపీ లతాబాలాజీ పలువురు పాల్గొన్నారు.
వెదురుకుప్పం: పచ్చికాపల్లం హైస్కూలులో ఆరోగ్యశాఖ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. జెడ్‌పిటిసి చల్లంపాళ్యెం సుకుమార్‌, మండల ఆరోగ్యశాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శి మోహన్‌ కుమార్‌, సచివాలయ సిబ్బంది, స్కూల్‌ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.
సోమల : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్యాధికారి జయసింహ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అధిక జనాభా వల్ల దేశ ఆర్థిక పరిస్థితుల్లోనూ అభివద్ధిలోనూ వెనకబడుతుందని ఇందుకోసం ప్రతి ఒక్కరూ కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు.
మండలంలోని ఎస్‌ఆర్‌పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జనాభా నియంత్రణపై వైద్యాధికారి డాక్టర్‌ పల్లవి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు కలిసి పురవీధుల్లో మానవహారం, అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌ హరిత, సూపర్వైజర్‌ గంగాదేవి, నర్సులు ,ఫార్మసిస్టు, స్థానిక ప్రజలు, వాలంటీర్లు పాల్గొన్నారు.
యాదమరి:యాదమరి, మాదిరెడ్డిపల్లి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. యాదమరి వైద్యాధికారిణి డాక్టర్‌ జ్యోతి, కమ్యూనిటీహెల్త్‌ ఆఫీసర్‌ లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సూపర్వైజర్లు నిర్మలమ్మ, లక్ష్మీపతి ఆరోగ్య,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.