'జన జాగరణ'లో పాల్గొనండి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైనత్య
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
ఈనెల 8వతేదీ క్విట్ ఇండియా పిలుపును పురస్కరించుకొని నిర్వహించే జనజాగరణలో కార్మిక, ప్రజాసంఘాలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎంఎస్‌ఆర్ మున్సిపల్ పార్కులో విఆర్‌ఏల సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ క్విట్ ఇండియా దినం సందర్భంగా నిర్వహించే ర్యాలీ తహశీల్దార్ కార్యాలయం నుండీ ఆర్‌డిఒ కార్యాలయం వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తి అవుతున్నా ప్రజల అశేష త్యాగాలతో కూడిన పోరాటాలతో సాధించుకొన్న స్వాతంత్ర ఫలితాలు ప్రజలకు దక్కలేదని అన్నారు. జాతీయోద్యమంలో సంబంధం లేని బిజెపి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆజాది కా అమృత్ మహౌత్సవ్ పేరుతో జాతీయభవేశాన్ని సష్టిస్తున్నదని విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఈసమావేశంలో పెరుమాళ్, భూపతి, మ్యూనిరత్నం, బాలకష్ణ, జయభారతి పాల్గొన్నారు.










