జంట ఏనుగుల దాడిలో పంట నష్టం
ప్రజాశక్తి- సోమల: పేటూరు సమీపంలోని ఓ రైతు పంట పొలంలో బుధవారం రాత్రి జంట ఏనుగులు తిరిగి మారేడు గడ్డల మొలకలు, బిందు సేద్యం పైపులను పూర్తిగా తొక్కేశాయి. రైతు రామచంద్ర మాట్లాడుతూ టమోటా, వరి ఇతర పంటలు వేసి ఏనుగుల బారి నుండి కాపాడుకునేందుకు సాధ్యం కాకపోవడంతో మారేడు గడ్డలను సాగు చేస్తున్నానని.. రూ.2 లక్షల ఖర్చు చేశానని ఏనుగులు ధ్వంసం చేయడంతో పూర్తిగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అటవీశాఖ అధికారులకు సమాచారమిస్తే నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని వాపోయారు. ఏనుగుల కట్టడికి ఇకనైనా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.










