- జల్లికట్టుపై బిగిస్తున్న" పట్టు '
- పోలీసుల ఆంక్షలు బేకాతర్
- సాంప్రదాయ ఆటకు బీజం పడింది నంబాలపల్లిలో...
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : అల్లిలో యువకులు నిలబడి ఎద్దులకు కట్టిన పట్టీలను చేజిక్కించుకునే ఆట (జల్లికట్టు) ప్రారంభమయింది. మండలంలో ఈ ఆటకు రోజురోజుకు ప్రాధాన్యత పెరిగిపోతుంది. న్యాయస్థానాలు పశువులను హింసించడం చట్టరీత్యా నేరం. నిలుపుదల చేయాలని అంటున్న, పోలీసుల ఆజ్ఞలను బేకాతర్ చేస్తూ ఎద్దుల పందాలను నిర్వహించడానికి వెదురు గొప్ప మండలం సిద్ధమయ్యింది. ఇది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో వెదురుకుప్పం మండలం, జక్కదొన పంచాయితీ, నంబాలపల్లి గ్రామంలో మొదటిగా గురువారం ఈ జల్లికట్టుకు బీజం పడింది.
- గ్రామీణ ప్రాంతాలలో జల్లికట్టు ఆట నిర్వాహన ఇలా...
గ్రామీణ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం జనవరి నెల మొదలవుతుందో లేదో తెలియదు కానీ అప్పుడే పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. గ్రామ పెద్దలు జల్లికట్టు నిర్వహించే ఊరులో ముందు రోజు పశువులకు కట్టేసేటందుకు దొడ్లను ఏర్పాటు చేస్తారు. గ్రామ నడివీధిలో అల్లి నిర్వహించడం జరుగుతుంది. నిర్వహించిన వీధిలోని ముగ్గు పిండితో హద్దు (అల్లి)ను నిర్ణయిస్తారు. అటువైపు నుంచి ఎద్దులను యువకులు నిలవరించుకోవచ్చు. దొడ్డిలోకి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల నుంచి కోడెగిత్తల కొమ్ములను చెక్కి రంగులు దిద్ది కొయ్య చెక్కతో వివిధ ప్రతిమలతో బొమ్మలతో కూడిన పట్టీళ్ళ,( బహామతులు) కట్టుతారు .వాటి యజమానులు రూపాయలు, 1116, 2016లు టవళ్ళలో చుట్టీ కొమ్ములకు కట్టి ,వాటిపైన కొయ్య చెక్కతో చేసిన పట్టిలను కట్టుతారు. యువకులు ఈ బహుమతులను చేజిక్కించుకునేందుకు అల్లిలో నిలబడి ఎద్దులను నిలవరించే ప్రయత్నం చేస్తారు. కొన్ని పశువుల కొమ్మలకు కట్టిన బహుమతులను యువకులు చేజెక్కించుకొని సంతోషంతో ఎగిరి గంతులేస్తారు. కొన్ని ఎద్దులు యువకుల చేతికి చిక్కకుండా పరుగులు తీస్తాయి. ఆ ఎద్దుల యజమాని సంతోషంతో గంతులేస్తాడు.
- జల్లికట్టు నిర్వహణలో యువకులదే పై చేయి..
ఈ జల్లికట్టు నిర్వహణ చేయరాదని వెదురుకుప్పం పోలీసులు గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పిస్తూ, ప్రచారం నిర్వహించారు. యువత మాత్రం పట్టు వీడడం లేదు. నిర్వహణ చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో వెదురుకుప్పం మండలానికి గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి పర్యటనకు వచ్చినప్పుడు ఆయనకు అర్జీ రూపంలో విన్నవించారు. ఆయన పై స్థాయి జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు. జిల్లా అధికారులు కోర్టు ఆంక్షలు ఉన్నాయని ఆయనకు చెప్పినట్లు సమాచారం.
- కాలానుగుణంగా మార్పులు
జల్లికట్టు నిర్వహణలో కాలానుగుణంగా మార్పులు వచ్చాయి. గతంలో అయితే పశువుల పండుగ జనవరి నెల సంక్రాంతి పండగలోనే జరుపుకునే వారు. గత పది సంవత్సరాలుగా సంక్రాంతి పండుగతో సంబంధం లేకుండా డిసెంబర్ నెల మధ్యలో నుంచి మార్చి వరకు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ముందుగా 2022వ సంవత్సరం డిసెంబరు నెల 25వ తేదీన తిరుపతి జిల్లాలోని వడమాల పేట మండలం, బుట్టిరెడ్డికండ్రిగా గ్రామంలో ఈ జల్లికట్టును నిర్వహించారు. 21వ తేదీ పాతశనంబట్ల గ్రామంలో ఈ జల్లికట్టు నిర్వహించారు. అయితే ఈ నెల నాలుగవ తేదీన పెనుమూరు మండలంలోని బోంతి వంక ఎస్సీ కాలనీలోనూ వెదురుకుప్పం మండలం అగ్గిచేన్నుపల్లి పంచాయతీ పొదలగుంట గ్రామంలోనూ జల్లికట్టును పోలీసులు అడ్డుకొని ధ్వంసం చేశారు.
- మండలాల్లో జల్లికట్టు నిర్వహించే గ్రామాలు ఇవే...
వెదురుకుప్పం మండలంలో 25 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మాంబేడు అదే పంచాయతీలో ఎగువ, దిగువ గెరిగిదొన .పచ్చికాపల్లం, అదే పంచాయతీలో పెద్ద, చిన్న పోట్టుచేను. కొమరకుంట, దామర కుప్పం, వెదురుకుప్పం, బ్రాహ్మణపల్లి, కొండక్రిందపల్లె, ఎగువ, దిగువ కనికాపురం, తదితర గ్రామాలలో ప్రతిఏటా ఈ జల్లికట్టును నిర్వహిస్తారు. ఈ జల్లికట్టు ఆటలో పోలీసులది పైచేయ, యువకుల పైచేయ వేచి చూడాలని స్థానికులు అంటున్నారు.










