మాట్లాడుతున్న డిఇ
జలవనరుల శాఖ డిఇగా చంద్రమౌళి
ప్రజాశక్తి-ఉదయగిరి:ఆత్మకూరు ఇఇ వెంకటేశ్వర్లు చంద్రమౌళికి పూర్తి బాధ్యతలు గురువారం అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఎఇ స్థాయి నుంచి డిఇగా ఉద్యోగోన్నతి కల్పించి తనకు బాధ్యతలు అప్పగించినందుకు ఉన్నతాధికారులకు కతజ్ఞతలు తెలిపారు. వారు తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తు డివిజన్ పరిధిలోని సీతారాంపురం, ఉదయగిరి మండలాలలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా తోటి సిబ్బందిని అప్రమత్తం చేసి విధులు నిర్వహిస్తానన్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న మట్టి మాఫియా పై కొరడా ఝళిపిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆ శాఖ సిబ్బంది పలువురు ఆయకట్ట రైతులు ఆయనకు శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ సిఎం ఓబుల్ రెడ్డి, తన అనుచరులతో కలిసి సన్మానం చేశారు.










