
* యుటిఎఫ్ ఆధ్వర్యాన నిరాహార దీక్ష
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: సిపిఎస్, జిపిఎస్ విధానాలను అంగీకరించమని, పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్.కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద పాత పెన్షన్ సాధనకు యుటిఎఫ్ ఆధ్వర్యాన గురువారం నిరవధిక దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలను యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదర్ రవీంద్ర, విశ్రాంత ఉప విద్యాశాఖ అధికారి కె.అప్పారావు, బి.మోహనరావు, కె.వైకుంఠరావు, బి.శ్రీరామ్మూర్తిలు ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పెన్షన్‌ను అమలు చేస్తే ఆర్థిక సంక్షోభం వస్తుందని ప్రజలకు ప్రభుత్వం మభ్యపెడుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెపుతున్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వందేళ్ల వరకు ఆర్థికభారం అని చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. జగన్మోహనరెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయకుండా దేశానికి ఆదర్శమని చెబుతున్న జిపిఎస్ విధానం తీసుకొస్తున్నారని అన్నారు. ఈ విధానం సిపిఎస్‌కి మరో రూపం తప్ప ప్రత్యామ్నాయం కాదని అన్నారు. 2024 ఎన్నికల్లో ఒపిఎస్ అమలు చేస్తామని చెప్పే పార్టీలకే ఉద్యోగం ఉపాధ్యాయ కుటుంబాల మద్దతు ఇస్తామని తెలిపారు. పాత పెన్షన్ అమలు చేసి ప్రజల పక్షాన ఉంటారా? జిపిఎస్ అమలు చేస్తామని కార్పొరేట్లు పక్షాన ఉంటారా? ప్రభుత్వం నిర్ణయించుకోవాలన్నారు. 33 ఏళ్ల సర్వీసు పూర్తి అయితేనే 50 శాతం పెన్షన్ ఇచ్చే జిపిఎస్ కాంట్రిబ్యూషన్ కట్టించుకుని జిపిఎస్ ఉద్యోగుల పాలిట మరణ శాసనం అవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిపిఎస్ కాకుండా ఒపిఎస్‌సి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 19న ప్రారంభమైన దీక్షలు ఒపిఎస్ సాధించే వరకూ నిరవధికంగా కొనసాగుతాయని తెలియజేశారు. 20న పాత తాలూకా కేంద్రాల్లో నిరహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్షలో జిల్లా సహాధ్యక్షులు ఎల్.బాబూరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.ఉమాశంకర్, జిల్లా కార్యదర్శి సిపిఎస్ జిల్లా కన్వీనర్ జి.నారాయణరావు, జిల్లా నాయకులు పి.ఉమాభాస్కర్‌పాల్గొన్నారు. ఈ దీక్షకు మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి గంగరాపు సింహాచలం, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు టి.తిరుపతిరావు, పంచాయతీరాజ్ మినిస్ట్రీ రియల్ నాయకులు కె.నారాయణరావు, బి.జయమ్మ, ఐలు నాయకులు బి.మోహనరావు, జె.వి.వి.నాయకులు, జి.గిరిధర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, పోస్టల్ యూనియన్ నాయకులు గణపతిరావు, డిటిఎఫ్ నాయకులు పూజారి హరిప్రసన్న సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బి.ధనలక్ష్మి, హనుమంతు అన్నాజీరావు, జి.శ్రీరామచంద్రమూర్తి, పి.మురళీధరరావు, జి.కోదండరావు, కె.రమేష్‌కుమార్, కె.వెంకటరావు పాల్గొన్నారు.