ప్రజాశక్తి - చిత్తూరుఅర్బన్
ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉత్సవాల్లో భాగంగా జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో రూ.317 కోట్లు అందజేసినట్లు ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఎం అరుణ తెలిపారు. బుధవారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం నందు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమత్ మహౌత్సవ్ ఉత్సవాల్లో భాగంగా జరిగిన రుణ వితరణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జోనల్ మేనేజర్ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా పొందుతున్న రుణాలను సద్వినియోగం చేసుకొని అభివద్ధి లోనికి రావాలని ఆకాంక్షించారు. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ ఏఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఆజాద్ కా అమత మహౌత్సవ్ పురస్కరించుకొని జరుగుతున్న రుణ వితరణ కార్యక్రమంలో భాగంగా సప్తగిరి గ్రామీణ బ్యాంకు వారిచే రూ.110.29 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారు తిరిగి రుణాలను చెల్లించే విషయంలో శ్రద్ధ చూపాలన్నారు. ఈ రుణ వితరణ కార్యక్రమంలో భాగంగా అతిథులచే డిసిసిబి రూ. 105 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.21.30 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.20 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.6.50 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.9.51 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.18.11 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.18.50 మెగా చెక్కులను అందజేయడం జరిగింది.
లీడ్ బ్యాంక్ మేనేజర్ శేషగిరిరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి జన సురక్ష పథకాలైన పిఎం సురక్షా బీమా యోజన, పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల పై అవగాహన ఏర్పరచుకుని సదివ్నియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిడి ఎం సునిల్, డిఆర్‌డిఏ పిడి తులసి, మెప్మా పిడి రాధమ్మ, ఎస్‌బిఐ చీఫ్ మేనేజర్ మురళి కష్ణ, యుబిఐ జెడ్‌ఎం పి డి వి శర్మ , డిఐసి డిడి రమణా రెడ్డి కె వి ఐ బి డి డి విద్యా సాగర్, కెనరా బ్యాంక్ డివిజినల్ మేనేజర్ గణేశ్ పాల్గొన్నారు.










