మాట్లాడుతున్న సిపిఎం నాయకులు
జిల్లాలో పరిశ్రమలు ఎక్కడ..?
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాళెం :జిల్లాలో పారిశ్రామిక అభివద్ధి లేక యువత పక్క రాష్ట్రాలకి వలస పోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కటారి అజరు కుమార్ అన్నారు. ఆయన గురువారం బుచ్చిరెడ్డిపాళెంలో జిల్లా సమగ్ర అభివద్ధికై సీతారాంపురం నుంచి నెల్లూరుకు వెళ్తున్న పాదయాత్ర దళంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలు విభజన జరిగాక ముందు నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా విశాఖ జిల్లాలో పోటీపడెదన్నారు. సాగులో రాష్ట్రంలో ముందు ఉండేదన్నారు. జిల్లాల వికేంద్రీకరణలో భాగంగా నెల్లూరు జిల్లా కుచించుకుపోయి పారిశ్రామిక ప్రాంతం మొత్తం పక్క జిల్లాకి అ పోయిందన్నారు. ఈ జిల్లాలో సీతారాంపురం నుంచి నెల్లూరు వరకు తాము పాదయాత్ర జరిగిన ప్రాంతాలు ఎక్కడ ఒక పరిశ్రమ కూడా లేదన్నారు. కోవూరు ప్రాంతంలోని సహకార చక్కర కర్మాగారం గత ప్రభుత్వ నిర్వాకంతో మూత పడిందన్నారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తారని చేసిన వాగ్దానం నీటిమూటయిందన్నారు. ప్రభుత్వం యువతకు ఉపాధి చూపించాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాలో సోమశిల ప్రాజెక్టు, పెన్నా డెల్టా ఉన్న రైతులకు సాగునీరు ప్రజలకు తాగునీరు అందడంలేదన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని సోమశిల హై లెవెల్ కెనాల్‌ని, రాళ్ళపాడు ప్రాజెక్టు, సీతారాం సాగరు ప్రాజెక్టు, గండిపాలెం ప్రాజెక్టు, పెద్దిరెడ్డి పల్లి, సర్వేపల్లి రిజర్వాయర్లను ఆధునికీకరించాలన్నారు. కష్ణపట్నం రామయపట్నం పోర్టులు అనుసంధానం చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికులకు 75శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. రామాయపట్నం పోర్ట్ కేంద్ర నిధులతో నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉపాధి పథకం పని దినాలను రెండు వందల రోజులకు పెంచి రోజుకు 600 వంద రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు.కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జొన్నలగడ్డ వెంకమరాజు, మూలె వెంగయ్య, జిల్లా కమిటీసభ్యులు ఎం.పుల్లయ్య, లక్ష్మీపతి, ఎం. గురునాథం, జి.నాగేశ్వరరావు, నాయకులు గండవరపు శ్రీనివాసులు, చల్లకొలుసు మల్లికార్జున, అంకయ్య, పి.మల్లికార్జున, తంబి రమణయ్య, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.










