Oct 19,2023 23:17

నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: 
జిల్లాలో 6,393 మంది రజకకు, 2,710 మంది నాయీబ్రాహ్మణులకు, 5,956 మంది దర్జీలకు రూ.15.05 కోట్ల నిధులు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి బటన్‌ నొక్కి వారి ఖాతాలకు జమ చేస్తున్నట్టు కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ తెలిపారు. గురువారం జిల్లాలో జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారులకు నిధులు విడుదల చేశారు. ఇందులో భాగంగా కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ నమూనా చెక్కును విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమదాలవలస నియోజకవర్గంలో 2,094 మందికి, ఎచ్చెర్లలో 2,210 మందికి, ఇచ్ఛాపురంలో 1,610 మంది, నరసన్నపేటలో 2,172 మందికి, పలాసలో 1,340 మందికి, పాతపట్నంలో 1,590 మందికి, శ్రీకాకుళంలో 2,235 మందికి, టెక్కలి నియోజకవర్గంలో 1,808 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన నాయీబ్రాహ్మణ లబ్దిదారులు పి.రామకృష్ణ, కొయ్యాపు పోలోడు, దర్జీ లబ్ధిదారులు వై.ఆదిలక్ష్మి, టి.పాపారావు, ఎన్‌.సుకన్య, రజక లబ్ధిదారులు ఎస్‌.రాజేష్‌, ఎస్‌.గీత, గౌరి, కళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు, పొందర కూరాకుల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ రాజాపు హైమావతి, వెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గంగు శారద, బిసి కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.గడ్డెమ్మ పాల్గొన్నారు.