జిల్లా విద్యాశాఖాధికారిగా విజయేంద్రరావు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: జిల్లా విద్యాశాఖాధికారిగా డిప్యూటీ డిఇఒ విజయేంద్రరరావును నియమిస్తూ శనివారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సురేష్ ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖాధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీరాం పురుషోత్తం స్థానంలో విజయేంద్రరావు జిల్లా విద్యాశాఖాధిరిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమవారం నుండీ నూతన డీఈఒగా విజయేంద్రరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయేంద్రరావు నూతన డిఇఒగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు విజయేంద్రరావును కలిసి అభినందనలు తెలిపారు.










