జిల్లా వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలందించాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలను గుండెకు వైద్యులను ఏర్పాటు చేసి ఈ వైద్యశాలలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని స్కానింగ్ కూడా ఏర్పాటు చేసి 24 గంటలు ఎమర్జెన్సీ అందుబాటులో ఉంచి వైద్యం అందించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కటారి అజరు కుమార్ పేర్కొన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా సోమవారం ఆత్మకూరు మండలం అశ్వినిపురం ఎస్‌సి కాలనీలో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో అశ్వినీపురం మహిళలు సమస్యలపై అజరు కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం అక్కడి పాదయాత్రగా బయలుదేరి ఆత్మకూరు పట్టణం చెరువు వద్ద సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు భారీగా బాణసంచా తపిట్లతో పూల వర్షం కురిపిస్తూ పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ నుండి బయల్దేరి ఆత్మకూరు పట్టణంలో భారీగా పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్ర సిపిఎం కార్యాలయానికి చేరుకుని అక్కడ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అజరుకుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి చెందడానికి కోసం రాజకీయ నాయకులు పార్టీలు దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న సిఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధికి కృషి చేయడం లేదని తెలిపారు. గతంలో ఉండే పాలకులు 75 సంవత్సరాలు అనంతరం ముఖ్యంగా మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని పలు మండలాలు ఇప్పటికీ కూడా మెట్ట ప్రాంతంగానే ఉంటున్నాయని తెలిపారు. వలసలు గతం కంటే అధికంగా ఉన్నాయన్నారు. తాము తిరిగిన పాదయాత్రలో సీతారామపురంలో శిలాఫలక ముందుగాని ఎటువంటి ప్రాథమిక అక్కడ ఇవ్వలేదని ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్లకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించలేదని తెలిపారు. దాదాపు సీతారాంపురం మండలం నుండి దుత్తులూరు, ఉదయగిరి, వరికుంటపాడు, కట్టు కొండాపురం, కలిగిరి, అనంతసాగరం, కలువాయి, చేజర్ల, సంఘం ఆత్మకూరు మండలాలన్నీ కూడా 16 మండలాలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యాయని కమ్యూనిస్టు పార్టీగా తాము వాదిస్తున్నామని తెలిపారు. బద్వేలు నుండి బయల్దేరితే ఆత్మకూరు మధ్యలో ఏదైనా ఆపద వస్తే దిక్కు లేదని కాబట్టి ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలను అప్ గ్రేడ్ చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఈ వైద్యశాలకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉపాధి లేక ఎక్కువ మంది వలసలు వెళ్తున్నారని తెలిపారు. నారంపేట వచ్చిన ఫ్యాక్టరీని బద్వేల్‌కు తరలి వెళితే స్థానికంగా ఉన్న మంత్రి, ఎంఎల్‌ఎ గానీ ఈ ప్రభుత్వం చూస్తూ ఉందన్నారు. అదే ఈ ఫ్యాక్టరీ ఆత్మకూరులో వచ్చి ఉంటే అనేకమంది యువతకు ఉపాధి దొరికేదని తెలిపారు. ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారన్నారు. ఇకనైనా ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు. జిల్లాకి సోమశిల ప్రాజెక్టు మనకు ఒక వరం లాంటిదని, అలాంటి సోమశిల వరదల కారణంగా అఫ్రన్ దెబ్బతింటే ఇప్పటికీ పట్టించుకోకపోవడం ఎంతో దుర్మార్గమన్నారు. ఇకనైనా స్థానిక ఎంఎల్‌ఎ ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆత్మకూరు నుండి సోమశిలకు వెళ్లే రోడ్డు మార్గం 70 ఎంఎం కనిపిస్తుందని, ఆత్మకూరు నుండి వింజమూరు వెళ్లే మార్గం సినిమా కనిపిస్తుందన్నారు. దళితులకు శ్మశానాలు లేవని, దళితులు రోజు అంబేద్కర్ బొమ్మ చుట్టూ తిరుగుతూ పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులకు మనం నిద్రలేచే లోపల ఊరంతా కూడా పరిశుభ్రం చేస్తారన్నారు. అనంతరం జిల్లా వ్యకాసం నాయకులు మూలి వెంగయ్య, మంగళి పుల్లయ్య, జిల్లా కౌలు రైతు సంఘం ఉపాధ్యక్షులు గంటా లక్ష్మీపతి, పట్టణ కార్యదర్శి డేవిడ్ రాజు, జిల్లా కెవిపిఎస్ నాయకులు ఆత్మకూరు నాగయ్యలు మాట్లాడారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు షేక్ సంధాని, ఎపి రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ ప్రసాద్, కృష్ణమోహన్, ఐద్వా నాయకురాలు గుల్జార్ బేగం, కొండ లక్ష్మమ్మ, కళాకారులు గద్దర్ బాబు తదితరులు ఉన్నారు.










