Oct 12,2023 19:51

క్రీడలకు ఎంపికైన విద్యార్థులు

ప్రజాశక్తి-గుడ్లూరు :త్వరలో జరగనున్న జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొని ఆడేందుకు మండలంలోని మొగుల్లూరు కేజీబీవీ బాలికల పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రత్యేక అధికారులు గురువారం తెలిపారు. ఇటీవల కందుకూరు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఆటల పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన కేజీ బీవీ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే ఆటల పోటీల్లో అండర్‌ -17 విభాగంలో ఎం భవ్య శ్రీ, వైశాలి, అనిత, నాగాంజలి అండర్‌ 14 ఈ భాగములు ఆర్‌ నాగశ్రీ, వాసవి, సరిత, హిమాంజలి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.