May 15,2022 22:05

రెజ్లింగ్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - యాదమరి : యాదమరి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 15 సంవత్సరాల ఏళ్లలోపు విద్యార్థిని విద్యార్థులకు జిల్లా స్థాయి రెజ్లింగ్‌ ఎంపిక పోటీలు నిర్వహించారు. రెజ్లింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌కే పురుషోత్తం ఆదేశాల మేరకు పోటీలో పాల్గొన్న విద్యార్థులు ఎంపిక నిర్వహించడం జరిగిందన్నారు. కుస్తీ పోటీలో ఎంపికైన క్రీడాకారులు 15వ తేదీ రాష్ట్రంలో మైలవరం ఎస్సీ స్పోర్ట్స్‌ అకాడమీలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు కే.రవి తెలిపారు.