జిల్లా పరిషత్‌లో 63 మందికి ఉద్యోగోన్నతి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
జిల్లా పరిషత్‌లో వివిధ కేటగిరిలో ఉన్న 63మంది ఉద్యోగులకు ఉద్యోగోన్నతి లభించింది. ఈమేరకు శుక్రవారం ఏఓగా ఐదుగురు, జూనియర్ అసిస్టెంట్/టైపిస్ట్ నుండి సీనియర్ అసిస్టెంట్‌గా ఎనిమిది మంది, రికార్డ్ అసిస్టెంట్ నుండి జూనియర్ అసిస్టెంట్‌గా 17 మంది, అటెండర్లు /వాచ్‌మెన్ నుండి రికార్డ్ అసిస్టెంట్లుగా 33 మంది సిబ్బంది మొత్తంగా 63 మందికి ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను జిల్లా పరిషత్ చైర్మన్‌శ్రీనివాసులు, సీఈవో ప్రభాకర్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం జడ్పీటీసీ సోమశేఖర్, మత్యం శరత్‌చంద్రారెడ్డి, జెడ్‌పి సిబ్బంది పాల్గొన్నారు.










