జిల్లా కేంద్రానికి చేరిన భూహక్కు పత్రాలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమానికి సంబంధించి వైఎస్‌ఆర్ జగనన్న భూహక్కు- భూరక్షా పథకానికి సంబంధించిన హక్కు పత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డిలు వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత ఖాతా, గతంలో ఉన్న సర్వే నెంబర్లు కొత్త భూహక్కు పథకం ద్వారా వచ్చిన పుస్తకంలో ఉన్న నెంబర్లను డిటి శివకుమార్ సర్వేయర్ గణేష్‌లతో కలసి పోల్చిచూశారు. 12గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులు జిల్లా కేంద్రానికి చేరాయి. వెరిఫికేషన్ కోసం గ్రామాలకు పంపనున్నారు.










