కలెక్టరేట్లో జిల్లా ఆవిర్భావ వేడుక
ప్రజాశక్తి - భీమవరం
రానున్న రోజుల్లో అధికారులంతా సమన్వయంతో పట్టుదలతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. జిల్లా ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ ప్రశాంతితో కలిసి సిబ్బంది కేక్‌కట్ చేసి ఆవిర్భావ వేడుక నిర్వహించారు. డిఆర్‌ఒ కె.కృష్ణవేణి, కార్యాలయం ఎఒ దుర్గాకిషోర్, డిఎల్‌డిఒ అప్పారావు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి పట్టుదలతో పనిచేసి కొత్త జిల్లాలో మొదటి ఉద్యోగిగా గుర్తు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, నిజాముద్దీన్ షా, వి.పెద్దిరాజు, పి.జగన్మోహన్, పి..గౌతమి పాల్గొన్నారు.










