Mar 25,2023 22:29

కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మికి వినతిపత్రం ఇస్తున్న ఎఐబిఎస్‌ఎస్‌ నాయకులు

          అనంతపురం కలెక్టరేట్‌ : బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 52 జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఫ్‌ు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.బాలాజీ నాయక్‌, పి.బాబు నాయక్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఎఐబిఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి కలెక్టరేట్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల గిరిజనులు విద్యా, ఉద్యోగ, ఉపాధి, సామాజిక రంగాల్లో తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ప్రభుత్వాలు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంతో మరింత వెనుకబాటుకు గిరిజనులు నెట్టివేయబడతారని తెలిపారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఫ్‌ు రాష్ట్ర నాయకులు రంగ్లా నాయక్‌, జిల్లా నాయకులు కిరణ్‌కుమార్‌ నాయక్‌, సుగుణబాయి, నరేష్‌ నాయక్‌, గోవిందు నాయక్‌, రాము నాయక్‌, ప్రసాద్‌ నాయక్‌, రామాంజినేయులు నాయక్‌, ధరమ్‌సింగ్‌ నాయక్‌, శ్రవణ్‌ నాయక్‌ పాల్గొన్నారు.