Mar 19,2022 23:27

మాట్లాడుతున్న నళీనిమోహన్‌


 జీవవైవిధ్య సంరక్షణ కొరకు జీవవైవిధ్య కమిటీలు
అటవీ , నేల, జల జీవవైవిధ్య పరిరక్షణ
జీవ వైవిధ్య రక్షణ చట్టాలు, అంతరించి పోతున్న అరుదైన జాతులను కాపాడటం
చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు 5 జిల్లాల జీవవైవిధ్య మండలి సభ్యులతో కార్యశాల


ప్రజాశక్తి - క్యాంపస్‌ :
ఈ కార్యక్రమంలో సభ్యులు వ్యవసాయ, జల, అటవీ జీవ వైవిధ్యం, జీవ వైవిధ్య రక్షిత ప్రాంతాలు, జీవ వైవిధ్య చట్టం, అరుదైన, అంతరించిపోతున్న జాతులు వంటి అంశాలపై చర్చించి జీవ వైవిధ్య నేపధ్య ఆధారిత సంరక్షణ ప్రణాళికను రూపొందించామని జీవవైవిధ్య మండలి చైర్మన్‌ ఎంకె రెడ్డి తెలిపారు. జిల్లాలోని పశుసంపద ముఖ్యంగా పుంగనూరు ఎద్దులను గూర్చి దాని బ్రీడింగ్‌ను గూర్చి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి రీసెర్చ్‌ డీన్‌ సర్జన్‌ రావు తెలిపారు. బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా , జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు డా.స్వామి, డా.పాండ్య రాయలసీమ ప్రాంతం లోని వక్ష, జీవ జాతులను గూర్చి తెలిపారు. అడవి ఉన్నత జీవ వైవిద్యానికి ఆనవాలు అని శేషాచలం అడవులలోని ఎర్రచందనం స్మగ్లింగ్‌ ను నిరోధించడం, కౌండిన్య ప్రొజెక్ట్‌లోని ఏనుగుల సంరక్షణ వంటివి క్లిష్టమయిన అంశాలను ఎదుర్కొంటూ జీవ వైవిధ్యంను కాపాడుతున్నట్లు ఈస్ట్‌ డిఎఫ్‌ఓ నరేందిరన్‌ తెలిపారు. శేషాచలం అడవుల్లో ఉన్న వివిధ అరుదైన జాతులను, అంతరించి పోతున్న సైకస్‌ బిడ్డోమి (పేరీత) మొక్కను రక్షించాలని ఎస్‌వి యూనివర్సిటీ వక్ష శాస్త్ర ఆచార్యులు డా.సావిత్రమ్మ తెలిపారు. ఈ సమావేశంలో నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ జిల్లా సమన్వయకర్త నీలకంఠ, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సుధాకర్‌ , రీజనల్‌ డిఎఫ్‌ఓ ఖాదర్‌వలి, ఫారెస్ట్‌ రిసోర్స్‌ పర్సన్‌ తులసయ్య, జీవవైవిధ్య మండలి వరలక్ష్మీ, కిశోర్‌ పాల్గొన్నారు.