జీతమిచ్చి కాపాడండి
స్వచ్ఛభారత్ కార్మికురాలు చాముండేశ్వరి
ప్రజాశక్తి- బంగారుపాలెం
జీతమిచ్చి కుటుంబాన్ని కాపాడాలని స్వచ్ఛభారత్ కార్మికురాలు చాముండేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ మండలంలోని రాగిమానుపెంట పంచాయతీలో స్వచ్ఛభారత్‌లో గత నాలుగేళ్లుగా కార్మికులురాలిగా విధులు చేపడుతున్నాని, పంచాయతీ కార్యదర్శిని జీతం కోసం అడగగా ప్రతిపాదనలు పంపామని మంజూరైన వెంటనే పంపిణీ చేపడతామని కాలయాపన చేస్తున్నారని వాపోయింది. స్వచ్ఛభారత్‌లో విధులు చేపట్టి జీతంలేక అర్థ ఆకలితో జీవనం గడుపుతున్నామని, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి నాకు రావాల్సిన జీతం ఇప్పించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేస్తున్న దాటవేసే సమాధానాలు చెప్తున్నారని ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి పని చేసిన దానికి జీతం మంజూరు చేయాలన్నారు.










