Oct 08,2022 23:34

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు

సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు పిలుపు
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
జిల్లాలో ఉన్న పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం జరుగుతున్న పోరాటాల్లో భాగంగా 13,14,15 తేదీల్లో జిల్లాలో జీపు జాత నిర్వహిస్తున్నట్లు శనివారం చిత్తూరు సిఐటియు ఆఫీసులో జరిగిన సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. ఈసమావేశానికి పంచాయతీ కార్మికుల యూనియన్‌ నాయకులు మధు అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయకపోవడం దారుణం అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం అక్టోబర్‌ 2న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె పిలుపునిచ్చినప్పటికీ ప్రజలదష్టిలో పెట్టుకొని సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే వెంటనే సమ్మెకు వెళతారని హెచ్చరించారు. జరగబోయే సమ్మెను పూర్తిస్థాయిలో జయప్రదం చేయడానికి మూడురోజులు పాటు జిల్లాలో జేబుజాత నిర్వహిస్తున్నట్లు కార్మికులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కనీస వేతనాలు అమలు చేయాలని రాజకీయ వేధింపులు మానుకోవాలని ఏసీ పీఎఫ్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న పోరాటానికి పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. మూడు రోజులు జరిగే జీపు జాతాలు కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈసమావేశంలో సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య, పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌ గోవిందప్ప, జిల్లా నాయకులు రామకష్ణ, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.