Jun 04,2023 21:36

ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డితో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

          ప్రజాశక్తి-బెలుగుప్ప   మండల పరిధిలోని జీడిపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన రిజర్వాయర్‌ కారణంగా ఊట నీటితో తీవ్ర ఇబ్బందులు ప్రజలకు ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. ఈమేరకు ఆదివారం కళ్యాణదుర్గంలో నిర్వహించిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం విజయోత్సవ సభలో పాల్గొనేందుకు వెళ్తున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విశ్వేశ్వరరెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీడిపల్లి పరిహారానికి సంబంధించిన సమస్యపై గ్రామస్తులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ దివంగత సిఎం రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో జీడిపల్లి గ్రామ సమీపంలో హంద్రీనీవా రిజర్వాయర్‌ నిర్మించారన్నారు. అప్పట్లో రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించడానికి రూ.82.12 కోట్లు నిధుల విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరామన్నారు. అయితే దశాబ్ధకాలంగా రైతులకు అమలు చేయాల్సిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇప్పటికీ పెండింగ్‌లో ఉందన్నారు. కావున రైతులకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద రూ.82.12 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ జీడిపల్లి గ్రామ ప్రజలు, రైతులు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.