'జిఐఎస్' పై విద్యుత్ శాఖ సిబ్బందికి అవగాహన
'జిఐఎస్' పై విద్యుత్ శాఖ సిబ్బందికి అవగాహన
ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి
మండల విద్యుత్ శాఖ కార్యాలయంలో సోమవారం ఏఈ చంద్రుడు ఆధ్వర్యంలో సిబ్బందికి జిఐఎస్‌పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఏఈ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబంధించి మండలంలోని 21 పంచాయతీ పరిధిలోని లైన్ ఇన్ప్పెక్టర్లు, లైన్‌మెన్లు, ఏఎన్‌ఎంలతో సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. విద్యుత్ బకాయిల వసూళ్లు, విద్యుత్ వినియోగదారులకు ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేసే విధానం గురించి అవగాహన కల్పించారు.










