
* శాసనసభ స్పీకర్ సీతారాం
ప్రజాశక్తి- ఆమదాలవలస: రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యమని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పట్టణంలోని మార్కెట్ కమిటీ యార్డులో 'వై ఎపి నీడ్' జగన్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రంగాల్లోనూ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోవాలన్నా, సంక్షేమ పథకాలు నిరంతరాయంగా కొనసాగాలన్నా వైసిపి గెలుపు అత్యంత ఆవశ్యమని అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు వచ్చే నెల 1 నుంచి పది వరకు 'వై ఎపి నీడ్ జగన్' కార్యక్రమాన్ని వాడవాడలా నిర్వహించనున్నట్లు తెలిపారు. నాలుగున్నరేళ్ల నుంచి దళారీ వ్యవస్థ మాయమయ్యిం దన్నారు. ప్రభుత్వ పథకాలను నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతుందని అన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా, వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించిన నాటి నుంచి పాలనలో పూర్తిస్థాయి పారదర్శకత ఏర్పడిందన్నారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ వాలంటీర్లు ప్రభుత్వ లక్ష్యాలను, ఉద్దేశాలను ప్రజలకు వివరిస్తూ, అర్హులైన లబ్ధిదారులను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను నేరుగా చేరవేస్తున్నారన్నారు. దీనివల్ల లబ్ధిదారుడు ప్రభుత్వ లబ్ధిని పొందుతున్నారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఇలా ప్రతి రంగంలోనూ ప్రజలు కోరుకునే, ఆశించే ఫలితాలు లభిస్తాయన్న విషయాన్ని ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని మండలంలో విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, ఎంపిపి ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్మూర్తి, జెడ్‌పిటిసి బెండి గోవిందరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, పిఎసిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, బొడ్డేపల్లి నారాయణరావు, గురుగుబెల్లి చలపతి, ఎన్ని రామచంద్రరావు, చల్ల సింహాచలం, దుంపల శ్యామలరావు, దుంపల చిరంజీవి పాల్గొన్నారు.