Apr 07,2023 14:52

ప్రజాశక్తి-వడమాలపేట(చిత్తూరు) : రాష్ట్రంలో జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమాన్ని ధైర్యంగా చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి  ఆర్.కె.రోజా  తెలిపారు. వడమాలపేట మండలం పూడి గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంను శుక్రవారం మంత్రి  ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి  మాట్లాడుతూ మా భవిష్యత్తు జగనన్నే భవిష్యత్ నువ్వే అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది  14 రోజులు ప్రతి కుటుంబానికి సర్వే చేస్తున్నారని తెలిపారు. గ్రామ సచివాలయం ప్రజల వద్దకు వెళ్లి మీకు మేం చెప్పింది చేశాం, సంతృప్తి గా ఉన్నారా, ఉంటే మాకు మద్దతివ్వండి మా జగనన్నకు అండగా నిలబడండి అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ దేశంలో ఏ పార్టీ కూడా ధైర్యంగా చేయలేని కార్యక్రమం ఇది, ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా పార్టీలో ఉంటూ ఎన్నో కులాలు ఉంటే ఎన్నో మతాలు పుట్టాయి ఎన్నో భిన్న అభిప్రాయాలు మనుషులు ఉంటారు వాళ్ళ అందర్నీ కలవాలి అంటే కత్తి మీద సామే కానీ జగన్ అన్న  కులం చూడం మతం చూడం పార్టీ చూడం పేదవాడు అయితే చాలు అయితే చాలు అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళకి అందాలి అని చెప్పి జగన్ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజు ప్రతి కుటుంబానికి పార్టీ చూడకుండా కులం చూడకుండా సంక్షేమాన్ని అందించాం కాబట్టే ఈ గ్రామంలో కి వెళ్ళిన పార్టీ వారైనా ఏ కులమైనా ఏ మతమైనా మీకు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకారం మేము చేస్తాం మీరు హ్యాపీగా ఉంటే కచ్చితంగా పార్టీలకతీతంగా సపోర్ట్ చేయండి అని చెప్పి జగన్ అన్న కి మద్దతు కూడగట్టే కార్యక్రమాన్ని ఈరోజు మా జగనన్న సైనికులు చేస్తున్నారని వివరించారు.  ఎమ్మెల్యేలు అందరం కూడా సమిష్టిగా పని చేస్తూ పీపుల్ సర్వే చేయటం వంటివి కూడా ప్రజలు గమనించాలి అన్నారు. మా కార్యక్రమాన్ని వివరిస్తూ వారి మద్దతు తీసుకుంటూ దాదాపుగా రాష్ట్రంలో 1 కోట్ల 60 లక్షల కుటుంబాలు,  దాదాపు 5 కోట్ల మంది ప్రజలు ఈ 14 రోజులు కలిసి జగన్ అన్నకి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని వెల్లడిస్తామని తెలిపారు. నాయకుడు తమ కుటుంబ సభ్యులకు మంచి చేస్తే ఆ ప్రజలు ఎంతగా అభిమానిస్తారు, ఎంత సపోర్టుగా ఉంటారు అనేది ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుస్తుందని అన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరూ కూడా మా భవిష్యత్తు పై జగనన్న అనే విధంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తామని చెప్పారు.