Jul 05,2022 14:32

ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం (చిత్తూరు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుక పంపిణీ నీ చిత్తూరు డిసిసిబి డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యంరెడ్డి , స్థానిక సర్పంచ్ డివి డిల్లెయ్య ఆధ్వర్యంలో కొత్తపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేదమూర్తి  పంపిణీ చేశారు. మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ 49 కొత్త పల్లి మిట్ట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 48 బసివిరెడ్డిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జగనన్న విద్యా కానుకను  స్కూల్ తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బ్యాగ్ యూనిఫామ్ ,షూ ,బెల్ట్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధియే ధ్యేయంగా విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకాన్ని అమలు పరిచారు. ఈ కార్యక్రమంలో కటికపల్లి సర్పంచ్ మార్కొండయ్య , కొత్తపల్లి మాజీ సర్పంచ్ దేవరాజుల రెడ్డి, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ధనలక్ష్మి, కొత్తపల్లిమిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లలిత కుమారి 48 బసిరెడ్డిపల్లి ప్రధానోపాధ్యాయులు మునికృష్ణ సిఆర్పి శివాజీ, స్కూలు చైర్పర్సన్ నాగలక్ష్మి , హేమావతి ,లీలావతి, స్కూల్ కమిటీ సభ్యులు విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు