Jul 17,2023 16:43
  • ఎంపీపీ యువరాజు

ప్రజాశక్తి-వీకోట : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష పథకం పేద ప్రజలకు రక్షణ కవచం లాంటిదని ఎంపీ యువరాజ్ తెలిపారు. మండల పరిధిలోని పెద్దభరినేపల్లి పంచాయతీ గ్రామ సచివాలయం పరిధిలో సోమవారం సర్పంచ్ శ్రీనివాసులు అధ్యక్షతన ఎంపీడీఓ వినోధా ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఎంపీపీ యువరాజ్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దెశం గూర్చి వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా పదకొండు రకముల సర్టిఫికెట్లు  అందజేస్తారనీ.  ముందుగా వాలంటీర్స్ మరియు సచివాలయ సిబ్బంది ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలకు ఏఏ సర్టిఫికెట్లు కావాలో వాటి వివరాలు సేకరించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా అందించడమేనన్నారు. అదేవిధంగా లబ్ధిదారులకు సర్టిఫికెట్లను ప్రజలకు అందజేశారు. ప్రభుత్వం రేషన్ కార్డు అర్హత ప్రామాణికంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేస్తుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ రాంచంద్రప్ప సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు , గ్రామస్తులు పాల్గొన్నారు.