Jul 15,2023 15:17
  • డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు

ప్రజాశక్తి-ఉండి : ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని డిసిసిబి చైర్మన్ పివిఎల్ నరసింహరాజు అన్నారు. శనివారం ఉండి మండలం యండగండి 1,2 సచివాలయాల పరిధిలో గ్రామ సర్పంచ్ గోగులమండ చిన్న కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పివిఎల్ నరసింహారాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహారాజు మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉండకూడదనే ఉద్దేశంతో జగనన్న సురక్ష, గడపగడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలను రూపొందించారని ఈ కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని వారికి సమస్యలను అధికారులకు నాయకులకు తెలియపరిస్తే సమస్య పరిష్కారానికి వారు కృషి చేస్తారని తెలిపారు. అనంతరం అర్హులకు ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, మండల పరిషత్ సహ ఉపాధ్యక్షురాలు దత్తాల సుజాత రాణి, కార్పొరేషన్ డైరెక్టర్ గులిపల్లి అచ్చారావు, నాయకులు బులుసు వెంకట రామకృష్ణ, గొర్రుముచ్చు సుందర్ కుమార్, వేగేశ్న వేణు, మండల ప్రత్యేక అధికారి రవికుమార్, మండల అభివృద్ధి అధికారి అడబాల వెంకట అప్పారావు, ఇంచార్జ్ తహసిల్దార్ ఎస్ వీరాస్వామి నాయుడు, మండల విస్తరణాధికారి అందే కొండలరావు, మండల వ్యవసాయ అధికారి బి సంధ్య, తదితర నాయకులు అధికారులు పాల్గొన్నారు.