Jul 17,2023 16:45
  • నగర మేయర్ మహమ్మద్ వసీం

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : జగనన్న సురక్షను సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. నగరంలోని 43 డివిజన్ లోని 62 సచివాలయం పరిధిలో సోమవారం జగనన్న సురక్ష కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నగర మేయర్ మహమ్మద్ వసీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా 11రకాల సర్టిఫికెట్ లు ఉచితంగా అందిస్తున్నారన్నారు. గతంలో ఈ సర్టిఫికెట్ లు కావాలంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో ప్రజల ఇంటి వద్దకే వాలేంటిర్ లను పంపించి 11రకాల సర్టిఫికెట్ లు అవసరమైన వాటిని అందిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ రమణారెడ్డి, కార్పొరేటర్లు ఇషాక్, కమల్ భూషణ్, అనిల్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు కిషోర్ తోపాటు సచివాలయ సిబ్బంది, వాలేంటిర్ లు పాల్గొన్నారు.