ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని 18వ డివిజన్ పరిధిలోని గుల్జార్ పేటలోని 25,26 సచివాలయాల పరిధిలో శనివారం జగనన్న సురక్ష' సర్వే కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ విజయ భాస్కర్ రెడ్డి, కమీషనర్ రమణారెడ్డిలతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష' కార్యక్రమంలో అర్హులై ఉండి సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారుల గుర్తింపునకు జరుగుతున్న సర్వే ప్రక్రియను మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ అర్హత ఉండి ఏ ఒక్క లబ్ధిదారుడు సంక్షేమ పథకాలకు దూరం కాకూడదు అన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయమన్నారు. పారదర్శకంగా ప్రతి ఇంటిని సర్వే చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ముంతాజ్ బేగం , కమల్ భూషన్ , అనిల్ కుమార్ ,సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు










