ప్రజాశక్తి-వెదురు కుప్పం : వెదురు కుప్పం మండలం బ్రాహ్మణపల్లి సచివాలయం పరిధిలో 49 మంది లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పత్రాలను సోమవారం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి బట్టే సుబ్రమణ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆయన కోరారు. వన్ టైం సెటిల్మెంట్ హక్కు పత్రాలు ద్వారా లబ్ధిదారులు బ్యాంకు రుణాలను పొందవచ్చునని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డిడిఓ ధనలక్ష్మి, సచివాలయం సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు










