Apr 22,2023 14:54

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రం ఆయన నార్పలలో శనివారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా శనివారం ఉదయాన్నే స్థానిక జామియా మసీదు నుండి ఊరేగింపుగా ఈదుగా మైదానానికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు..