Oct 21,2023 23:33

పోస్టర్లను అందజేస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- కోటబొమ్మాళి:  వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను గాలికి వదిలివేసి ప్రతిపక్ష నాయకులపై కక్ష్య సాధింపుతో కేసులు పెడుతూ రాష్ట్ర అభివృద్దిని వదిలివేశారని, రాష్ట్ర ప్రజలు జగన్‌ను నమ్మే స్థితిలో లేరని మాజీ ఎంపిపిలు తర్ర రామకృష్ణ, కామేశ్వరరావుల అన్నారు. శనివారం మండలంలో తర్లిపేట పంచాయతీలో మండల టిడిపి నాయకులంతా కలిసి బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సిఎం చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందులు గురిచేయడం చాలా బాధాకరమైన చర్యని వారు మండి పడ్డారు.
చంద్రబాబు నాయుడు అనారోగ్యంగా దెబ్బతీసేందుకే జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర చేస్తున్నారన్నారు. దీర్ఘకాలిక చర్మ సమస్య వలన వేడినీళ్లు అందించాలని ప్రభుత్వాన్ని అడిగినా పట్టించుకోరా అని మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో టెక్కలి మండల పార్టీ అధ్యక్షుడు బగాది శేషు, రెడ్డి అప్పన్న, ఎస్‌,శ్రీనివాసరావు, గొండు లక్ష్మణరావు, కర్రి అప్పారావు, శిమ్మ సింహాచలం, వాన లక్ష్మి, కొర్రాయి మల్లేసు, పైల తవిటయ్య, కోరాడ గోవిందరావు, శిమ్మ నారాయణరావు, సర్పంచ్‌ ఓడరేవు శ్రీనివాసరావు పాల్గొన్నారు.