అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం కింద 35,056 మంది విద్యార్థులకు సంబంధించి 31,576మంది తల్లుల ఖాతాలకు రూ. 29.25 కోట్లను జమ చేసినట్లు కలెక్టర్ ఎమ్.గౌతమి తెలిపారు. అనంతపురం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యాదీవెన పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ''జగనన్న విద్యా దీవెన పథకం'' కింద 35,056 మంది విద్యార్థులకు సంబంధించి 31,576మంది తల్లుల ఖాతాలకు రూ.29.25 కోట్ల జమ చేశామన్నారు.కాలేజీ ఫీజులు గతంలో నేరుగా మేనేజ్‌మెంట్ ఖాతాలకు జమ అయ్యేవని, ప్రస్తుత ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలను ఉపయోగించుకుని తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ యువత కనే కలల సాకారంలో జగనన్న ఎప్పటికీ అండగా ఉంటారన్నారు. అనంతరం జగనన్న విద్యా దీవెన పథకం మెగా చెక్కును విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుశల్ జైన్, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, అడిషనల్ ఎస్పీ హనుమంతు, ఏడీసీసీ బ్యాంకు ఛైర్‌పర్సన్ లిఖిత, ఆర్టీసీ రీజనల్ ఛైర్‌పర్సన్ మంజుల, సీడబ్ల్యూసీ ఛైర్ పర్సన్ మేడా రామలక్ష్మి, వక్ఫ్ బోర్డు ఛక్ష్మిర్ పర్సన్ రిజ్వాన్, కార్పొరేటర్ సైఫుల్లా, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విశ్వమోహన్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అన్నా దొర, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖుష్బు కొఠారి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎస్‌ఎమ్ డి.రఫీ పాల్గొన్నారు.










