Oct 21,2023 20:59

మాట్లాడుతున్న ఎంపిడిఒ

మాట్లాడుతున్న ఎంపిడిఒ
జగనన్న సురక్షతోనే ఆరోగ్య భద్రత
ప్రజాశక్తి-కోవూరు:ముందస్తు చర్యలో భాగంగా సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా ఆరోగ్యభద్రతకు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఉపయోగమని పోతిరెడ్డి పాలెం పంచాయతీ సర్పంచ్‌ నలుబోలు శ్రీవాణి అన్నారు. శనివారం గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు.ఇలాంటి కార్యక్రమం ద్వారా ప్రజలు ముంగిటే ఉచిత వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం ఒక వరమని అన్నారు, సురక్ష కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు, ఎంపిడిఒ శ్రీహరి అధ్యక్షతన జరిగింది. వైస్‌ ఎంపీపీ శివుని నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఏపీ లో పెట్టిన వైద్య సదుపాయం ఏ రాష్ట్రంలో లేదన్నారు. ప్రజల సంక్షేమంలో ఇది ఒక బాగమని అన్నారు.
కార్యక్రమంలో ఎఎంసి చైర్మెన్‌ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డ్డి, వైద్యాధి కారులు, పిఎసిఎస్‌ చైర్మెన్‌ రామి రెడ్డి మల్లికార్జున రెడ్డి, జొన్న వాడ ట్రస్ట్‌ బోర్డు మెంబెర్‌ తిరుమూరు సుప్రజ, ఎంపిపి పార్వతి, జెడ్‌పిటిసి శ్రీలత, హైటెక్‌ ఫార్మా అధినేత నలుబోలు వెంకటరమణారెడ్డి, మండల కన్వీనర్‌ నలుబోలు సుబ్బారెడ్డి, గాజుల మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.