Oct 26,2023 17:28

వైద్య పరీ క్షలు చేయించుకొంటున్న కావ ల్‌ రెడ్డి హరిచంద్రారెడ్డి

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న ఆరోగ్య సుర క్ష పథకం పేదలకు ఒక గొప్ప వర మని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పి ఏసిఎస్‌) ఛైర్పర్సన్‌ కావల్‌ రెడ్డి హరి చంద్రా రెడ్డి పేర్కొన్నారు. తోటపల్లిగూడూరు మండలం కోడూరు చెన్నపల్లెపాలెం హై స్కూల్‌ లో గురువారం జగన న్న ఆరోగ్య సురక్ష శిభిరం జరి గింది. ఎంపీడీఓ కన్నం హేమలత ఆధ్వర్యా న జరిగిన ఈ కార్యక్రమంలో హరిచంద్రారెడ్డి ము ఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష తో పేదల ఆరోగ్యానికి వైసీపీ ప్రభుత్వం అత్యం త రక్షణ కల్పిస్తోందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రె డ్డి ఆలోచనా విధానం నుంచి పుట్టిన అద్భుత ప థకమని హరిచంద్రారెడ్డి తెలిపారు. జగనన్న ఆ రోగ్య పథకం ద్వారా ఎన్నో పేద కుటుం­బాలకు ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయన్నా రు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్‌ హస్పెటల్స్‌ లో ఉచితంగా మెరుగైన వైద్యం అందుతోందని హరిచంద్రారెడ్డి పేర్కొన్నా రు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాం లో ఆరోగ్య రంగం కుదేలైందని అయన విమ ర్శించారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా వుండా లన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న జగనన్న ఆరో గ్య సురక్ష పథకాన్ని సద్వి ని యోగం చేసుకోవాలని హరిచంద్రా రెడ్డి సూ చించారు. వైద్య శిభిరంలో కోడూరు, వరిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది రోగు లను పరీక్షించి, మందులు పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో వైసీపీ నాయకులు ఆగాల శ్రీనివా సులు రెడ్డి, మారంరెడ్డి బుజ్జిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.